Subrahmanyaa: ‘సుబ్రహ్మణ్య’ మూవీ గ్లింప్స్ చూశారా..

ABN, Publish Date - Sep 17 , 2024 | 09:36 PM

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో.. తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తోన్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Subrahmanyaa Movie Still

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ (P Ravishankar) తన దర్శకత్వంలో.. తన కుమారుడు అద్వయ్‌ (Advay)ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తోన్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’ (Subrahmanyaa). ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌, ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో ఈ మూవీ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ గ్లింప్స్ గమనిస్తే.. విషపూరిత పాములతో నిండిన బావిలోకి అద్వయ్ జంప్ చేయడంతో గ్లింప్స్ ప్రారంభమైంది. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం ప్రారంభిస్తాడు. VFX, యానిమేషన్ అత్యుత్తమంగా ఉన్నాయి, ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. ఈ గ్లింప్స్‌లో కనిపించిన భారీ వానరాలు ఆసక్తిని మరింతగా పెంచాయి. దర్శకుడు పి రవిశంకర్ గ్లింప్స్‌తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా గ్లింప్స్ చివరి షాట్ వావ్ అనేలా ఉంది. ఈ విజువల్ వండర్ గ్లింప్స్‌తో ‘సుబ్రహ్మణ్య’ ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా మారింది.


విదేశాల్లో శిక్షణ తీసుకున్న అద్వయ్ తెరపై తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అతని ప్రజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్, యాటిట్యూడ్ చార్మ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనినిస్తున్నాయి. దర్శకుడు పి రవిశంకర్ గొప్ప అనుభూతిని అందించే అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నాడనేది ఈ గ్లింప్స్‌తో తెలుస్తోంది. భగవాన్ శ్రీ రాముడు కనిపించిన చివరి సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. సాంకేతికంగా కూడా వావ్ అనేలా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘సుబ్రహ్మణ్య’ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 17 , 2024 | 09:36 PM