మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siddharth and Aditi Rao Hydari: అదితి రావు క్లారిటీ ఇచ్చేసింది

ABN, Publish Date - Mar 28 , 2024 | 03:35 PM

బుధవారం కోలీవుడ్ హీరో సిద్దార్థ్ (Siddharth), బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) మ్యారేజ్ చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై వారిరువురి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వార్తలు మాత్రం వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలకు సమాధానం అన్నట్లుగా తాజాగా అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చేసింది.

బుధవారం కోలీవుడ్ హీరో సిద్దార్థ్ (Siddharth), బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) మ్యారేజ్ చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై వారిరువురి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వార్తలు మాత్రం వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు సమాధానం అన్నట్లుగా తాజాగా అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చేసింది. ‘అతను ఎస్ చెప్పాడు’ అంటూ సిద్దార్థ్‌తో కలిసి ఉన్న పిక్‌ని పోస్ట్ చేసింది. దీంతో వారి విషయంలో వినబడుతున్న వార్తలన్నీ నిజమే అనేలా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ పిక్‌ని చూస్తుంటే వారికి పెళ్లి కాలేదు కానీ.. ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరిగినట్లుగా ఈ ఫొటో చూస్తుంటే తెలుస్తోంది. (Aditi Rao Hydari Clarity on Relation with Siddharth)

Read Also: Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?


వారిద్దరి విషయానికి వస్తే.. కొంతకాలంగా వారి రిలేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ‘మహాసముద్రం’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య హీరో శర్వానంద్ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి వరకు ఈ బంధాన్ని తీసుకువెళుతున్నట్లుగా అదితి తాజా ప్రకటనతో స్పష్టమైంది. (Siddharth and Aditi Rao Hydari)

అదితి రావు హైదరి పోస్ట్ చేసిన ఈ ఫొటోలో.. ఇద్దరూ రింగ్స్‌తో కనిపిస్తున్నారు. అలాగే ఆమె పోస్ట్‌లో ‘అతను ఎస్ చెప్పాడు’ అని చెబుతూ.. ఎంగేజ్డ్ అని రింగ్ ఎమోజీని అదితి పోస్ట్ చేసింది. దీంతో వారికి ఇంకా పెళ్లి కాలేదని, కేవలం నిశ్చితార్థం మాత్రమే అయిందనేలా ఈ పిక్‌తో అదితి రావు హైదరి చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సిద్ధార్థ్ కూడా సేమ్ ఫొటోని షేర్ చేసి.. ‘ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్’ అని పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ వారి బంధంపై క్లారిటీ ఇచ్చినట్లయింది.


ఇవి కూడా చదవండి:

====================

*Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

***************************

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

Updated Date - Mar 28 , 2024 | 04:37 PM