మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రేవ్‌పార్టీ కేసులో నటి హేమకు బెయిల్‌

ABN, Publish Date - Jun 14 , 2024 | 03:35 AM

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో అరెస్ట్‌ అయి జైలు జీవితం గడుపుతున్న నటి హేమకు ఊరట లభించింది. బుధవారం ఆమెకు బెయిల్‌ లభించింది. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వాడకంపై బెంగళూరు ఎన్‌డీపీఎస్‌ కోర్టులో...

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో అరెస్ట్‌ అయి జైలు జీవితం గడుపుతున్న నటి హేమకు ఊరట లభించింది. బుధవారం ఆమెకు బెయిల్‌ లభించింది. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వాడకంపై బెంగళూరు ఎన్‌డీపీఎస్‌ కోర్టులో విచారణ జరిగింది. ‘హేమ డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు న్యాయస్థానానికి సమర్పించలేదు’ అని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. హేమపై ఆరోపణలు వచ్చిన పది రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆమెకు నెగెటివ్‌ వచ్చిందని, ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదు అని న్యాయవాది కోర్టుకు నివేదించారు. సీసీబీ (బెంగళూరు నేర నియంత్రణ దళం) న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ‘హేమ మరికొంత మంది టాలీవుడ్‌ సినీ ప్రముఖులను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేశారు, నోటీసులు పంపినా అనారోగ్య కారణాలను సాకుగా చూపి విచారణకు హాజరుకాలేదు, అందువల్లే ఆమెను అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది’ అని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఆమె ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అరెస్ట్‌ తర్వాత తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

Updated Date - Jun 14 , 2024 | 03:35 AM