మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: కాబోయే ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నటుడు సుధీర్ బాబు

ABN, Publish Date - Jun 10 , 2024 | 03:33 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది, నటుడు సుధీర్ బాబు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి సుబ్రమణ్యస్వామి విగ్రహాన్ని సుధీర్ బాబు బహూకరించారు.

Actor Sudheer Babu met and congratulated TDP chief Chandrababu Naidu and presented him Lord Subramanyam idol

ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ, జన సేన పార్టీల కూటమి 161 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు బావమరిది, నటుడు సుధీర్ బాబు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మహేష్ బాబు బావ, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తన తోడల్లుడు అయిన సుధీర్ బాబు ని తీసుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్లి అతన్ని పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. ఈనేపధ్యంలో చంద్రబాబు సుధీర్ బాబుని భుజం తట్టి సరదాగా నవ్వుతూ కొన్ని నిముషాలు మాట్లాడారు. గల్లా జయదేవ్ తెలుగు దేశం పార్టీ తరపున గుంటూరు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు, కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం అతడు నిలుచోలేదు. రాజకీయాల నుండి కొంత కాలంపాటు విరామం తీసుకుంటున్నట్టుగా అయన ప్రకటించిన సంగతి తెలిసిందే. (Actor Sudheer Babu met and congratulated TDP chief Chandrababu Naidu and presented him Lord Subramanyam idol)

తాను పోటీ చెయ్యకపోయినా, తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన తోడల్లుడు సుధీర్ బాబు ని చంద్రబాబుకి పరిచయం చేశారు గల్లా జయదేవ్. ఈ సందర్భంగా సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని చంద్రబాబుకి బహుకరించారు సుధీర్ బాబు.

తన రాబోయే చిత్రం 'హరోం హర' లో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కూడా ఈమధ్యనే విడుదలైంది, ఆసక్తికరంగా కూడా వుంది. ఈ సినిమా ఈనెల 14న విడుదలవుతోంది.

Read more!
Updated Date - Jun 10 , 2024 | 03:33 PM