Actor Sivaji: ‘కూర్మనాయకి’లో శివన్నగా శివాజీ.. లుక్ అదిరింది

ABN, Publish Date - Jun 29 , 2024 | 07:57 PM

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘కూర్మనాయకి’. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని శివాజీ లుక్‌ని మేకర్స్ వదిలారు.

Actor Sivaji in Kurmanayaki

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘కూర్మనాయకి’ (Kurmanayaki). ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రానటువంటి కథా కథనాలతో దర్శకుడు హర్షవర్థన్ కడియాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని శివాజీ (Actor Sivaji) లుక్‌ని మేకర్స్ వదిలారు.

జూన్ 30 శివాజీ పుట్టినరోజు. ఈ సందర్భంగా శివాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘కూర్మనాయకి’లో ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ని, స్పెషల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. శివాజీ ఈ చిత్రంలో ‘శివన్న’ (Sivanna)గా ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.


అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నామని.. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయ్యాయని.. థర్డ్ షెడ్యూల్‌లో శివాజీ జాయిన్ అయినట్లుగా మేకర్స్ తెలిపారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ‘కూర్మనాయకి’ సినిమాలో ఓ స్టార్ హీరో (Star Hero) నటించనున్నారట. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.

Updated Date - Jun 29 , 2024 | 07:57 PM