యాక్షన్‌ ప్రేమ కథ ‘కాక్రోచ్‌’

ABN, Publish Date - Oct 16 , 2024 | 06:00 AM

పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌, ఆదిత్య సినిమాస్‌ సంయుక్త బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాక్రోచ్‌’. ఈ చిత్రం టైటిల్‌ని...

పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌, ఆదిత్య సినిమాస్‌ సంయుక్త బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాక్రోచ్‌’. ఈ చిత్రం టైటిల్‌ని యూనిట్‌ ప్రకటించింది. ‘విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ ప్రేమ కథ, పాత కొత్త నటీ నటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది. చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చిత్ర బృందం తెలిపింది.

Updated Date - Oct 16 , 2024 | 06:00 AM