Aay Movie: ‘ఆయ్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు రెడీ

ABN , Publish Date - Aug 08 , 2024 | 10:50 PM

వరుస విజయాలతో దూసుకెళుతోన్న జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతోన్న లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాతో అంజి కె.మణిపుత్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. యుబైఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.

Aay Movie Still

వరుస విజయాలతో దూసుకెళుతోన్న జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్ నుంచి రాబోతోన్న లేటెస్ట్ మూవీ ‘ఆయ్’ (Aay). ‘మ్యాడ్’ (Mad) చిత్రంతో మెప్పించిన యంగ్ హీరో నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక (Nayan Sarika) జంటగా నటించిన ఈ సినిమాతో అంజి కె.మణిపుత్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, రీల్స్‌, షార్ట్స్ అన్నీ ప్రేక్ష‌కల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. (Aay Movie Censor Formalities Completed)

Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

గోదావ‌రి జిల్లా బ్యాక్ డ్రాప్, అక్క‌డున్న ప్రెండ్స్‌కు సంబంధించిన క‌థ‌తో ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సెన్సార్ నుంచి యుబైఏ సర్టిపికేట్‌ను సొంతం చేసుకుంది. సినిమా రన్ టైమ్‌ను 2 గంట‌ల 21 నిమిషాలకు ఫిక్స్ చేశారు. ఔట్ అండ్ ఔట్ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం అల‌రించ‌నుందని, కుటుంబంలోని భావోద్వేగాలు, స్నేహం, కామెడీ, రొమాన్స్‌తో పాటు చ‌క్క‌టి ట్విస్టుతో సినిమాను తెర‌కెక్కించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న గ్రాండ్‌‌గా థియేటర్లలోకి రానుంది.


Aay-Censor.jpg

విడుదలకు ఒక రోజు ముందు అంటే.. ఆగ‌స్ట్ 14న ఈ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాలో హీరో అనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాననే ధీమాని హీరో నార్నే నితిన్ వ్యక్తం చేస్తున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 10:50 PM

AAY Movie: ‘ఆయ్’ ఆగ‌స్ట్ 15న వ‌స్తున్నామండి.. రెడీగా ఉండండి మ‌రి

AAY Theatrical Trailer: నార్నే నితిన్ ‘ఆయ్’ ట్రైల‌ర్‌

AAY: ‘సూఫియానా’.. లిరికల్ సాంగ్

AAY: నాయ‌కి ఏమైనాదే.. మ‌రి రంగనాయ‌కి ఏమైనాదే! పాట‌.. అదిరిపోయిందిగా

Aay: ట్రెండింగ్‌లో మెలోడీ గీతం.. ‘సూఫియానా..’