Hello Baby: ఆది సాయికుమార్ ఆవిష్కరించిన ‘హలో బేబీ’ ట్రైలర్

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:34 PM

ఎస్‌కే‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘హలో బేబీ’. సోలో పాత్రతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోలో పాత్రలో కావ్య కీర్తి నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో ఆది సాయికుమార్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Aadi Sai Kumar with Hello Baby Movie Team

ఎస్‌కే‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రామ్ గోపాల్ రత్నం (Ram Gopal Rathnam) దర్శకత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ (Kandregula Adinarayana) నిర్మిస్తోన్న చిత్రం ‘హలో బేబీ’ (Hello Baby). సోలో పాత్రతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోలో పాత్రలో కావ్య కీర్తి నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో ఆది సాయికుమార్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ


ట్రైలర్ విడుదల అనంతరం ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ను చూస్తుంటే సోలో క్యారెక్టర్‌తో ఒక సినిమా తీయడం అనేది నిజంగా మెచ్చుకోవలసిన విషయం. ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిసింది. ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని.. హ్యాకింగ్‌పై వస్తున్న మొట్టమొదటి చిత్రంగా ఈ సినిమాను జనాలు గుర్తుంచుకుంటారు. దర్శకనిర్మాతలకు, సోలో పాత్రలో నటించిన కావ్య కీర్తికి, ఇంకా ఈ సినిమాకు పనిచేసిన టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. (Aadi Sai Kumar Launches Hello Baby Movie Trailer)


Hello-Baby.jpg

నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం. భారతదేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా ఇప్పటికే పురస్కారనంది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి రావడంతో మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ రమణ, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మరియు సింగిల్ పాత్రలో నటించిన హీరోయిన్ కావ్య కీర్తి (Kavya Keerthi). వారంతా ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారు. ప్రత్యేకంగా మా డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషిని మరువలేను. ఎన్నో మరిచిపోలేని సంఘటనలు ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగాయి. ప్రేక్షకులను అలెర్ట్ చేసే చిత్రంగా ఈ సినిమా ఉంటుంది..’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 04:34 PM

Hello Baby: దేశంలోనే.. హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్‌తో వ‌స్తున్న మొట్టమొదటి చిత్రం ‘హలో బేబీ’

Hello Baby: హలో బేబీ.. ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసిన హీరో నవీన్ చంద్ర

Hello Baby: హీరోయిన్ నందితా శ్వేత వదిలిన ‘హలో బేబీ’ మోషన్ పోస్టర్

Hello Baby: మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా పాట విడుదల

Hello Baby: ‘హలో బేబీ’ కావ్య కీర్తికి పురస్కార్ నంది అవార్డు