Hello Baby: ‘హలో బేబీ’ కావ్య కీర్తికి పురస్కార్ నంది అవార్డు

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:10 PM

హైదరాబాద్‌లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో ‘హలో బేబీ’ చిత్రంలో నటించిన కావ్య కీర్తికి పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బేబీ’. హ్యాకింగ్ నేపథ్యంలో సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ ‘హలో బేబీ’లో కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించారు.

Hello Baby Actress Kavya Keerthi

హైదరాబాద్‌లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో ‘హలో బేబీ’ చిత్రంలో నటించిన కావ్య కీర్తికి పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ (SKML Motion Pictures) నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బేబీ’ (Hello Baby). హ్యాకింగ్ నేపథ్యంలో సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ ‘హలో బేబీ’లో కావ్య కీర్తి (Kavya Keerthi) ప్రధాన పాత్రలో నటించారు.

Also Read- Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కావ్య కీర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్‌తో తీయబడిన ‘హలో బేబీ’ చిత్రంలోని నటనకు గానూ ఈ పురస్కార్ నంది అవార్డు (Puraskar Nandi Award) రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ అవార్డుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా.. మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ, హీరోయిన్ శ్రీవాణి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకున్నారు.


Puraskar-Nandi.jpg

సోలో క్యారెక్టర్‌తో సినిమా చేయడం అనేది చాలా సహజకరమైనటువంటి విషయం. ఈ కథని రాస్తున్నప్పుడే కచ్చితంగా మంచి అవార్డ్స్ వస్తాయని నమ్మాను. అందుకనే ఈ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టాను అని ప్రొడ్యూసర్ ఆదినారాయణ కాండ్రేగుల (Kandregula Adinarayana) అన్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 07:10 PM

Hello Baby: మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా పాట విడుదల

Hello Baby: దేశంలోనే.. హాకింగ్ విత్ సొలో క్యారెక్టర్‌తో వ‌స్తున్న మొట్టమొదటి చిత్రం ‘హలో బేబీ’

Hello Baby: హలో బేబీ.. ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసిన హీరో నవీన్ చంద్ర

Hello Baby: హీరో నవీన్ చంద్ర వదిలిన ప్రమోషనల్ సాంగ్

Hello Baby: ‘హలో బేబీ’కి బెస్ట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అవార్డ్.. ఎక్కడంటే