టైమ్‌ ట్రావెల్‌ మూవీ

ABN, Publish Date - Oct 06 , 2024 | 02:48 AM

సాయిరోనక్‌, అమృత చౌదరి జంటగా నటించిన ‘రివైండ్‌’ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఎన్నారై కల్యాణ్‌ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు..

సాయిరోనక్‌, అమృత చౌదరి జంటగా నటించిన ‘రివైండ్‌’ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఎన్నారై కల్యాణ్‌ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. శనివారం విడుదల చేసిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే మంచి కథను ఎన్నుకుని మాకున్న బడ్జెట్‌లోనే సినిమా తీశాం. మా దర్శకుడు కల్యాణ్‌ ఎన్నారై అయినా ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మంచి కథతో సినిమా తీయడం అభినందనీయం’ అన్నారు. ‘ఆదరణ ఉంటుందని మేం కూడా టైమ్‌ ట్రావెల్‌ కథను ఎన్నుకొని ఆసక్తికరంగా చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులకునచ్చుతుందని మా నమ్మకం’ అని చెప్పారు దర్శకనిర్మాత కల్యాణ్‌.

Updated Date - Oct 06 , 2024 | 02:48 AM