కంటతడి పెట్టించిన కవిత
ABN, Publish Date - Aug 16 , 2024 | 12:23 AM
విలక్షణ నటుడు, గాయకుడిగా సుపరిచితుడైన ఆయుష్మాన్ ఖురానా పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న ట్రైనీ వైద్యురాలి హత్య ఘటన పై తన కలం ఝుళిపించారు. బాధితురాలి ఆవేదనకు అక్షరరూపం ఇచ్చిన ఆయన ఆ కవితను...
విలక్షణ నటుడు, గాయకుడిగా సుపరిచితుడైన ఆయుష్మాన్ ఖురానా పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న ట్రైనీ వైద్యురాలి హత్య ఘటన పై తన కలం ఝుళిపించారు. బాధితురాలి ఆవేదనకు అక్షరరూపం ఇచ్చిన ఆయన ఆ కవితను చదువుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అది విన్న మనసున్న ప్రతి మనిషి కళ్లు ఆర్తితో చెమర్చుతున్నాయి. ‘నేనే అబ్బాయిని అయి ఉంటే గది తలుపు వేయకుండా నిద్రపోవచ్చు కదా’ అంటూ మొదలైన కవిత మగవాడిగా ఉండడంలోని స్వేచ్ఛను, ఆడపిల్లలపై ఉన్న పరిమితులను వర్ణిస్తూ సాగింది. తన ఆవేదనను ఆయుష్మాన్ ఆవిష్కరించిన తీరుతో ఆ కవిత విన్న ప్రతి ఒక్కరూ ఆ వైద్యురాలి ఆవేదనను అనుభూతి చెందుతున్నారు. ‘నిర్భయ హత్య ఘటన జరిగి 12 ఏళ్లు... అయినా మనలో మార్పు రాలేదు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఘటన’ అని నటి కరీనా కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలియాభట్, ప్రీతిజింతా సహా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ ఘటనను ఖండించారు.