ఉత్కంఠ భరిత చిత్రం
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:56 AM
రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిశోర్ టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యారెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు...
రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిశోర్ టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యారెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఉత్కంఠను రేకెత్తించే ఈ మూవీలో మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారుతుంది. పోలీసులు కేసును ఛేదించలేక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమిస్తారు. బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేమ జంటతో సహా ఏడుగురు అనుమానితులను గుర్తిస్తాడు డిటెక్టివ్. వెన్నెల కిశోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్‌కు జీవం పోశాడు. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల ప్రేమ జంటగా నటించారు.