యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథ

ABN, Publish Date - Oct 23 , 2024 | 02:12 AM

కన్నడ నటుడు, ‘ఉగ్రమ్‌’ ఫేమ్‌ శ్రీ మురళీ నటించిన చిత్రం ‘బఘీరా’. డాక్టర్‌ సూరి దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు. ప్రశాంత్‌ నీల్‌ అందించిన కథతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 31న సినిమా...

కన్నడ నటుడు, ‘ఉగ్రమ్‌’ ఫేమ్‌ శ్రీ మురళీ నటించిన చిత్రం ‘బఘీరా’. డాక్టర్‌ సూరి దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు. ప్రశాంత్‌ నీల్‌ అందించిన కథతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 31న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా శ్రీమురళి మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇందులో నాది లార్టర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్‌. ఈ సినిమాలో లుక్‌ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన కథకు దర్శకుడు సూరి 100 శాతం న్యాయం చేశారు. ఆయన దర్శకత్వ ప్రతిభ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్ళింది. ఇది యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథ. ఈ సినిమా యాక్షన్‌ ప్రియులకు ఫుల్‌ మీల్స్‌లా ఉండనుంది. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ తన నటనతో కట్టిపడేస్తారు. సంగీతం, విజువల్స్‌ ఈ సినిమాకు ప్రధానాకర్షణ. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Oct 23 , 2024 | 02:12 AM