మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:52 AM

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ వంటి టాప్‌ స్టార్స్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషనల్‌ కంటెంట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికలిగిస్తోంది. అలాగే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్న ‘ఎపిక్‌ జర్నీ ఎపిసోడ్‌ వన్‌’ కుతూహలాన్ని...

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ వంటి టాప్‌ స్టార్స్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషనల్‌ కంటెంట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికలిగిస్తోంది. అలాగే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్న ‘ఎపిక్‌ జర్నీ ఎపిసోడ్‌ వన్‌’ కుతూహలాన్ని మరింత పెంచింది. తాజాగా గురువారం రెండో ఎపిసోడ్‌ను విడుదల చేశారు. ఇందులో దర్శకుడు మాట్లాడుతూ ‘మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. ఒక్కో వరల్ద్‌ నుంచి ఒక్కో థాట్‌ ప్రాసెస్‌తో ప్యూచరిస్టిక్‌గా బిల్డప్‌ చేశాం. ఇందులో కాశీ మొదటిది. ఈ ప్రపంచంలో కాశీనే చివరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ‘కల్కి’ స్ర్కిప్ట్‌ మొదలు పెట్టాం. కలియుగం చివరిలో గంగానది ఎండిపోయిన తర్వాత కాశీ ఎలా ఉంటుంది, నాగరికత ఏ విధంగా ఉంటుంది అనే ఊహతో ఆ సిటీని క్రియేట్‌ చేశాం. ఇండియన్‌ ఆర్కిటెక్చర్‌, వెహికిల్స్‌, కరెన్నీ.. ఇలా అన్ని విషయాల్లో ప్యూచరిస్టిక్‌గా ఆ సిటీని రూపొందించాం. కాశీ పైన పిరమిడ్‌ ఆకారంలో ఉండే స్ట్రక్చర్‌ ఉంటుంది. దాన్ని మేం కాంప్లెక్స్‌ అంటాం.


భూమిపై లేని నేచర్‌, యానిమల్స్‌, ఫుడ్‌.. అక్కడ ఉంటాయి. ఇదో రకం స్వర్గం అనుకోవచ్చు. మూడో ప్రపంచం శంబల. కాశీకీ, కాంప్లెక్స్‌కూ సంబంధం లేని ప్రపంచం అది. అక్కడ ఉన్న వారు కాంప్లెక్స్‌లో ఉన్నవారిని ఛాలెంజ్‌ చేస్తుంటారు. కల్కి అవతారం శంబలలో పుడుతుందనే నమ్మకం మన శాస్త్రాల్లో ఉంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో మరొకటి కలగలుస్తూ ‘కల్కి’ కథ నడుస్తుంది’ అన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 12:52 AM