సంపదను కాపాడేవాడూ సైనికుడే

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:31 AM

‘సరిహద్దును కాపాడేవాడే సైనికుడు కాదు... సంపదను కాపాడేవాడూ సైనికుడే’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రంలోనిది ఈ డైలాగ్‌...

‘సరిహద్దును కాపాడేవాడే సైనికుడు కాదు... సంపదను కాపాడేవాడూ సైనికుడే’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రంలోనిది ఈ డైలాగ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత ్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలవుతోంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ బుధవారం నిర్వహించింది. హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘అమితాబ్‌బచ్చన్‌ గారి ‘షోలే’ చిత్రం విడుదలైన ఆగస్టు 15న మా సినిమా కూడా విడుదలవడం కాకతాళీయమే. ఈ సినిమాకు ‘మిస్టర్‌ బచ్చన్‌’ టైటిల్‌ను రవితేజ గారు నిర్ణయించారు’ అని చెప్పారు.

Updated Date - Aug 08 , 2024 | 04:31 AM