మెరుపుల వాన
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:46 AM
శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విశ్వం’. టీ.జీ.విశ్వప్రసాద్, వేణుదొణెపూడి నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఆక్టోబర్ 11న చిత్రం...
శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విశ్వం’. టీ.జీ.విశ్వప్రసాద్, వేణుదొణెపూడి నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఆక్టోబర్ 11న చిత్రం విడుదలవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మొరాకన్ మగువ’ను మేకర్స్ విడుదల చేశారు. ‘చురచుర చూపుల నైనా.. కొరకొర మెరుపుల వాన’ అంటూ సాగే ఈ గీతాన్ని రాకేందు మౌళి రచించగా..పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఆలపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.