రొమాంటిక్ కామెడీ డ్రామా
ABN, Publish Date - Sep 22 , 2024 | 02:35 AM
‘హీరో’ ఫేమ్ అశోక్ గల్లా, గౌరి ప్రియ జంటగా ఓ నూతన చిత్రంలో నటిస్తున్నారు. ఉద్భవ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమాను...
‘హీరో’ ఫేమ్ అశోక్ గల్లా, గౌరి ప్రియ జంటగా ఓ నూతన చిత్రంలో నటిస్తున్నారు. ఉద్భవ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే మొదలెట్టనున్నాం. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈ చిత్రంలో గుండెలకు హత్తుకునే డ్రామా కూడా ఉంటుంది’’ అని చెప్పారు.