పిల్లలతో చూడాల్సిన సినిమా
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:18 AM
ప్రియదర్శి, విశ్వదేవ్, నివేద థామస్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో రానాదగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు...
ప్రియదర్శి, విశ్వదేవ్, నివేద థామస్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో రానాదగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇది పిల్లలతో కలసి చూడాల్సిన సినిమా. దర్శకుడు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా తెరకెక్కించార’ని ప్రశంసించారు.