పదేళ్లు గుర్తుండే సినిమా

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:49 AM

‘నేను‘మను’ చిత్రంతో నిర్మాతగా మారా. అది సెప్టెంబర్‌ 6న విడుదలైంది. నా పదో చిత్రం ‘35.. ఇది చిన్న కథ కాదు’ కూడా సెప్టెంబర్‌ 6నే విడుదలవుతుండడం ఆనందంగా ఉంది’ అన్నారు సృజన్‌ యరబోలు. సిద్ధార్థ్‌ రాళ్లపల్లితో

‘నేను‘మను’ చిత్రంతో నిర్మాతగా మారా. అది సెప్టెంబర్‌ 6న విడుదలైంది. నా పదో చిత్రం ‘35.. ఇది చిన్న కథ కాదు’ కూడా సెప్టెంబర్‌ 6నే విడుదలవుతుండడం ఆనందంగా ఉంది’ అన్నారు సృజన్‌ యరబోలు. సిద్ధార్థ్‌ రాళ్లపల్లితో కలసి ఆయన నిర్మించిన ‘35.. ఇది చిన్న కథకాదు’ విడుదల సందర్భంగా మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘జనాలకు గుర్తుండిపోయి, క్లాసిక్‌గా నిలిచే కథ కోసం వెదుకుతున్న తరుణంలో నాకు నచ్చిన కథ ‘35.. చిన్న కథకాదు’. మదర్‌ సెంటిమెంట్‌కు మించిన కమర్షియల్‌ ఎలిమెంట్‌ లేదు. ఈ కథలో అది అద్భుతంగా కుదిరింది. చిత్రం విడుదలయ్యాక బాగుందనే టాక్‌ స్ర్పెడ్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఇది థియేటర్‌ కోసమే తీసిన సినిమా. పదేళ్లు గుర్తుండి పోతుంది’ అన్నారు సృజన్‌.

Updated Date - Sep 03 , 2024 | 05:49 AM