ఇప్పటివరకూ రాని సినిమా

ABN, Publish Date - Aug 30 , 2024 | 05:55 AM

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్‌ గోలీ ‘రాజ రాజ చోర’ చిత్రం తర్వాత కలసి చేస్తున్న చిత్రం ‘శ్వాగ్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రాజు, భవభూతి, సింగ, యయాతి పాత్రలను శ్రీవిష్ణు, రాణి రుక్మిణీదేవి పాత్రలో రీతూ వర్మ నటించారు. ఈ చిత్రం టీజర్‌ విడుదల చేసిన సందర్భంగా గురువారం

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్‌ గోలీ ‘రాజ రాజ చోర’ చిత్రం తర్వాత కలసి చేస్తున్న చిత్రం ‘శ్వాగ్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రాజు, భవభూతి, సింగ, యయాతి పాత్రలను శ్రీవిష్ణు, రాణి రుక్మిణీదేవి పాత్రలో రీతూ వర్మ నటించారు. ఈ చిత్రం టీజర్‌ విడుదల చేసిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ మన అందరి ఇళ్లలో ఉన్న పాయింటే అయినా ఇండియన్‌ స్ర్కీన్‌ మీద ఇప్పటివరకూ రాని సినిమా ఇది. ఇలాంటి సినిమా తీయడానికి ఽముందుకు వచ్చిన విశ్వప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. ‘శ్రీవిష్ణు, హసిత్‌తో కలసి ఇంతకుముందు ‘రాజ రాజ చోర’ సినిమా చేశాం. ‘శ్వాగ్‌’ చాలా విభిన్న చిత్రం’ అని తెలిపారు విశ్వప్రసాద్‌. దర్శకుడు హసిత్‌ గోలీ మాట్లాడుతూ ‘ఇది అచ్చ తెలుగు సినిమా. కంటెంట్‌ చాలా మాట్లాడుతుంది. తాత, ముత్తాతలతో కలసి చూడగలిగే సినిమా. విష్ణు బాగా చేశారు. ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా అవుతుంది’ అన్నారు. మీరా జాస్మిన్‌, దక్ష నాగార్కర్‌, శరణ్య ప్రదీప్‌, సునీల్‌, రవిబాబు, గెటప్‌ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించారు.

Updated Date - Aug 30 , 2024 | 05:55 AM