మా జీవితాల్ని మార్చిన సినిమా
ABN, Publish Date - Sep 01 , 2024 | 05:33 AM
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో...
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘నా తల్లితండ్రులు నాకు జన్మనిస్తే పవన్‌కల్యాణ్ బతుకునిచ్చారు. నన్ను నేను నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన పిలిచి ‘గబ్బర్‌సింగ్ ’సినిమా ఇచ్చి నన్ను నిలబెట్టారు. ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ రాబోయే పాతికేళ్లు తెలుగు చిత్రపరిశ్రమలో నంబర్ వన్‌గా ఉంటారు’ అని చెప్పారు. ‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో ‘గబ్బర్‌సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అనే వెలితి నా మనసులో ఉండేది. ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్‌తో అది తీరుతోంది. మా జీవితాలను మార్చేసిన సినిమా ‘గబ్బర్‌సింగ్’’ అని హరీశ్‌శంకర్ చెప్పారు.