మనసులో నిలిచిపోయే సినిమా

ABN, Publish Date - Nov 29 , 2024 | 06:09 AM

అల్లరి నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్‌ పాత్రను చేస్తున్నారు నరేశ్‌. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా...

అల్లరి నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్‌ పాత్రను చేస్తున్నారు నరేశ్‌. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ ‘దర్శకుడు సుబ్బు కథ ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. ‘గమ్యం’, ‘నాంది’ చిత్రాల్లా ‘బచ్చలమల్లి’ కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. సినిమాలో పాటలు కూడా స్పెషల్‌గా ఉండబోతున్నాయి. డిసెంబర్‌ 20న చిత్రం విడుదలవుతుంది. చూసి ఆదరించండి’ అని కోరారు.

‘ఇందులో నరేశ్‌ ఎగ్రెసివ్‌ క్యారెక్టర్‌ చేశారు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చూడగానే సినిమా బిగ్‌ హిట్‌ అనే కాన్ఫిడెన్స్‌ వచ్చింది’ అని చెప్పారు హీరోయిన్‌ అమృత.

దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ‘కరోనా సమయంలో మా అమ్మగారిని చూడడానికి సరైన సమయంలో వెళ్లలేకపోయా. నేను వెళ్లేటప్పటికే అదే చివరి చూపు అయింది. అప్పుడే అనిపించింది.. లైఫ్‌లో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదు.. అని. ఇలాంటి పాయింట్‌ మీదే కథ తయారు చేయాలనిపించింది. నరేశ్‌గారు కూడా ఎంకరేజ్‌ చేశారు. చాలా మంచి సినిమా అవుతుంది’ అన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 06:09 AM