పొల్లాచ్చిలో ప్రేమ గీతం
ABN, Publish Date - Aug 26 , 2024 | 06:00 AM
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్యారాజేశ్ నటిస్తున్నారు. భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో సాగే పాటను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ మాజీ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కీలకపాత్ర పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.