యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం
ABN, Publish Date - Nov 22 , 2024 | 05:02 AM
విలక్షణ నటుడు డాక్టర్ మోహన్‌బాబుది ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం. ‘స్వర్గం.. నరకం’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన నేటితో 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు...
విలక్షణ నటుడు డాక్టర్ మోహన్‌బాబుది ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం. ‘స్వర్గం.. నరకం’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన నేటితో 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. హీరోగా, విలన్‌గా ఆయన రూటే సపరేటు. సొంతంగా చిత్ర నిర్మాణసంస్థను నెలకొల్పి మోహన్‌బాబు నిర్మించిన 75 చిత్రాలు దాదాపు అన్నీ ఘన విజయం సాధించాయి. అలాగే విద్యారంగంలోనూ ఆయన విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కన్నప్ప చిత్రంలో మహాదేవ శాస్త్రిగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం ఆయన కెరీర్‌లో మరో మైలు రాయి అని చెప్పాలి. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆయన తనయుడు విష్ణు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకూ ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.