మానవతా విలువల మాణిక్యం

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:53 AM

నంద పెరియసామి దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్‌ మాణిక్యం’. జీపీ రేఖా రవి కుమార్‌, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్‌ నిర్మాతలు.‘సీతారామం’ ఫేమ్‌ విశాల్‌...

నంద పెరియసామి దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్‌ మాణిక్యం’. జీపీ రేఖా రవి కుమార్‌, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్‌ నిర్మాతలు.‘సీతారామం’ ఫేమ్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం డిసెంబరు 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసి మాట్లాడుతూ ‘నిర్మాతల్లో ఒకరైన రవి నాకు మంచి స్నేహితుడు. అతను నిర్మించిన మొదటి సినిమా ‘మిస్టర్‌ మాణిక్యం’ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ కంటెంట్‌ని నమ్మి నిర్మించిన సినిమా ఇది. మానవతా విలువలకు పట్టం కట్టే విధంగా ఈ సినిమా కథాంశం ఉంది’ అని అన్నారు.


సముద్రఖని మాట్లాడుతూ ‘విమానం తర్వాత నేను ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిన సినిమా ‘విమానం’. ‘మిస్టర్‌ మాణిక్యం’ అంతకు మించి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది. మానవతా విలువల ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది’ అని తెలిపారు.

Updated Date - Nov 26 , 2024 | 03:53 AM