నవ్వించే సినిమా
ABN, Publish Date - Oct 08 , 2024 | 02:06 AM
సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా నటించిన ‘జనక అయితే గనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం మచిలీపట్నంలో జరిగింది. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా హాజరై యూనిట్‌కు అభినందనలు...
సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా నటించిన ‘జనక అయితే గనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం మచిలీపట్నంలో జరిగింది. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా హాజరై యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ ‘మీ జిల్లా వాడు, మీలో ఒకడైన సుహాస్ నటించిన సినిమా ఇది. ‘జనక అయితే గనక’ పెద్ద హిట్ కాబోతోంది. అందరినీ నవ్వించే సినిమా ఇది’ అని తెలిపారు. ఈ చిత్ర విజయం మీద ఎంతో నమ్మకం ఉందని హీరో సుహాస్ చెప్పారు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీ్‌పరెడ్డి బండ్ల దర్శకుడు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు కూడా పాల్గొన్నారు.