ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:01 AM

తన దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సాయి కిశోర్‌ దర్శకుడిగా మారి రూపొందించిన ‘ధూమ్‌ధాం’ చిత్రం టీజర్‌ను హీరో గోపీచంద్‌తో కలసి విడుదల చేశారు దర్శకుడు శ్రీను వైట్ల...

తన దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సాయి కిశోర్‌ దర్శకుడిగా మారి రూపొందించిన ‘ధూమ్‌ధాం’ చిత్రం టీజర్‌ను హీరో గోపీచంద్‌తో కలసి విడుదల చేశారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీమోహన్‌ ఈ సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే అందించారు. చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్మెస్‌ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమలో నాకు ఉన్న మిత్రుల్లో హీరో గోపీచంద్‌ ఒకరు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దాం. భారీ బడ్జెట్‌తో లావి్‌షగా నిర్మించాం. విదేశాల్లో కూడా షూటింగ్‌ చేశాం. సెప్లెంబర్‌ 13న విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - Aug 13 , 2024 | 05:01 AM