మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విధ్వంసాల జాతర

ABN, Publish Date - Feb 08 , 2024 | 05:30 AM

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు...

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కావ్యాథాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈనెల 9న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఆద్యంతం రవితేజ్‌ యాక్షన్‌ హంగామా కనిపించింది. సరికొత్త మేకోవర్‌లో ఆయన కనిపించారు. ‘వచ్చాడంటే మోతరా, విధ్వంసాల జాతర’ అంటూ ఆయన పలికిన డైలాగ్‌లు మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, మధుబాల, అజయ్‌ఘోష్‌, శ్రీనివా్‌సరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సంగీతం: డేవ్‌ జాంద్‌

Updated Date - Feb 08 , 2024 | 05:30 AM