భారతీయ సినిమాకు అవార్డుల పంట

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:02 AM

సుచి తలాటి దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా, ఫయాజ్‌ అలీ నిర్మించిన ‘గర్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం...

సుచి తలాటి దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా, ఫయాజ్‌ అలీ నిర్మించిన ‘గర్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లాస్‌ ఏంజిల్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ జ్యూరీ అవార్డును సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్స్విలేనియా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లోని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ గ్రాండ్‌ జ్యూరీ అవార్డులను కైవసం చేసుకుంది. ఇలా వరుసగా మూడు గ్రాండ్‌ జ్యూరీ అవార్డులు సాధించి హ్యాట్రిక్‌ సాధించింది. ఈ సందర్భంగా నిర్మాతలు రిచా చద్దా, ఫయాజ్‌ అలీ మాట్లాడుతూ ‘ఇలా ఒక నెలలోనే ఈ సినిమాకు మూడు గ్రాండ్‌ జ్యూరీ పురస్కారాలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇది మా కష్టానికి దక్కిన గౌరవం. మా హృదయాలకు చేరువైన ఈ సినిమా.. ఇంతటి ఘనమైన ప్రదర్శన చేస్తుండడం జీవితాంతం మర్చిపోలేని విషయం. ఒక నిర్మాతగా మొదటి సినిమాకే ఇంత ఖ్యాతి రావడం మా అదృష్టం’ అని చెప్పారు. కాగా, 16 ఏళ్ల అమ్మాయి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి పాణిగ్రహి ప్రధాన పాత్రలో నటించారు.

Updated Date - Jul 03 , 2024 | 03:02 AM