ఊహించిన దాని కంటే పెద్ద హిట్
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:53 AM
నితేశ్‌రాణా దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మత్తువదలరా 2’. శ్రీ సింహకోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా..
నితేశ్‌రాణా దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మత్తువదలరా 2’. శ్రీ సింహకోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా దర్శకుడు నితేశ్‌రాణా మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహం ఒకవైపు.. చిరంజీవి, మహేశ్‌బాబు అందించిన ప్రశంసలు మరోవైపు.. ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈ సినిమా మా చిత్రబృందం ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు శ్రీ సింహకోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా హ్యూజ్ అస్సెట్‌గా నిలిచారు. కాలభైరవ ఇచ్చిన సంగీతాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రల్ని జనరంజకంగా మలిచేందుకు ఎన్నో రిఫరెన్స్‌లు తీసుకున్నాను. ఇంకో సినిమా చేయడానికి సన్నాహాలు చేసున్నాను. ఆ తర్వాతే ‘మత్తు వదలరా 3’ ఉంటుంది.