69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 విజేతలు వీరే...
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:26 AM
దక్షిణాది తారలంతా తళుక్కున మెరిసిన ‘69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024’ వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గెలుపు గుర్రాలకు పురస్కారాలను అందించారు. సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘చిన్నా’ అత్యధికంగా ఏడు...
దక్షిణాది తారలంతా తళుక్కున మెరిసిన ‘69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024’ వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గెలుపు గుర్రాలకు పురస్కారాలను అందించారు. సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘చిన్నా’ అత్యధికంగా ఏడు అవార్డులు కొల్లగొట్టగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కిన ‘దసరా’ చిత్రం ఆరు విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘బేబీ’.. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఐదు అవార్డులతో మూడో స్థానంలో నిలిచాయి. తమిళంలో ఉత్తమ నటుడిగా ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రానికి విక్రమ్.. ‘మామన్నన్’ (నాయకుడు) సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ‘పుష్ప’ ఫేమ్ ఫహాద్ ఫాజిల్, ఉత్తమ నటిగా ‘చిన్నా’ చిత్రానికి నిమిషా సజయన్ ఎంపికయ్యారు. తెలుగువారిని విశేషంగా అలరించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ చిత్రానికి ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ నటిగా రుక్మిణీ వసంత్ ఎంపికయ్యారు. మలయాళ నటుడు మమ్ముట్టి ‘నన్‌పకల్ నేరతు మయక్కం’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అవార్డుల ప్రదానోత్సవంలో నాని మాట్లాడుతూ ‘‘కెరీర్ తొలినాళ్లలో అవార్డులు అందుకోవాలనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు నేను నటించిన, నిర్మించిన సినిమాల్లోని నటీనటులు ఈ అవార్డులు అందుకుంటుంటే చూడాలని ఉంది. నాతో సినిమాలు తీసిన ఇద్దరు నూతన దర్శకులు అవార్డులు అందుకొన్నందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఓ అభిమాని చేసిన పనిని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఓ అభిమాని.. ఓ రోజు హఠాత్తుగా పెళ్లి చేసుకుంటానని.. ఇంటి వాకిలి ముందు వాలిపోయాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యా’’ అని కీర్తి సురేశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వాఖ్యాతలుగా సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, విశాఖ వాఖ్యాతలుగా వ్యవహరించారు.
తెలుగు సినిమా విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం - బలగం
ఉత్తమ దర్శకుడు - వేణు ఎల్డంది (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు(విమర్శకుల ఎంపిక) - సాయి రాజేశ్ (బేబీ)
ఉత్తమ నటుడు - నాని (దసరా)
ఉత్తమ నటుడు (విమర్శకుల ఎంపిక) - ప్రకాశ్ రాజ్(రంగ మార్తాండ), నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి)
ఉత్తమ నటి - కీర్తి సురేశ్,
ఉత్తమ నటి (విమర్శకుల ఎంపిక) - వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ సహాయ నటుడు - బ్రహ్మానందం
(రంగమార్తాండ), రవితేజ (వాల్తేరు వీరయ్య)
ఉత్తమ సహాయ నటి - రూపా లక్ష్మి (బలగం)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - బేబీ
ఉత్తమ గీత రచయిత - అనంత శ్రీరామ్ (బేబీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు - శ్రీరామ చంద్ర
(ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ)
ఉత్తమ నేపథ్య గాయని - శ్వేతా మోహన్
(మాస్టారు మాస్టారు - సార్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - సత్యన్ సూరన్ (దసరా).