40 రోజులు వైజాగ్‌లోనే...

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:30 AM

సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సోమవారం నగరానికి విచ్చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై-విశాఖ విమానంలో ఇక్కడకు చేరుకున్న ఆయన నగరంలోకి వెళ్లారు...

సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సోమవారం నగరానికి విచ్చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై-విశాఖ విమానంలో ఇక్కడకు చేరుకున్న ఆయన నగరంలోకి వెళ్లారు. కాగా విమానాశ్రయంలో రజనీకాంత్‌ కనిపించడంతో పలువురు తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు, వీడియాలు తీశారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘కూలీ’ చిత్రం షూటింగ్‌ 40 రోజులపాటు నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌, తదితర ప్రాంతాల్లో జరగనున్నట్టు తెలిసింది.

గోపాలపట్నం (విశాఖపట్నం)

Updated Date - Aug 27 , 2024 | 04:30 AM