Rana Daggubati: చిన్న కథ పెద్ద సక్సెస్.. చాలా హ్యాపీగా వుంది

ABN, Publish Date - Sep 08 , 2024 | 06:51 PM

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.

35 Chinna Katha Kaadu Thank You Meet

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ.. బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని టీమ్ థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించింది.

Also Read- Jailer Villain: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ విలన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ కార్యక్రమంలో మూవీ ప్రజెంటర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. ‘35-చిన్న కథ కాదు’ సినిమా సక్సెస్ చాలా సంతృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్‌తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని మోసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్‌గా వుంది. సురేష్ ప్రొడక్షన్స్ ‘పిట్టగోడ’ సినిమా ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. ‘35 చిన్న కథ కాదు’లో తన నటన సర్‌ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. మీడియాకి థాంక్ యూ. ఈ సినిమాకి మీడియా ఇచ్చిన స్టార్స్ నేనెప్పుడూ చూడలేదు. చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్‌ని థియేటర్స్‌లో హౌస్ ఫుల్‌గా చూడటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు నందు వలనే ఇది సాధ్యమైంది. తనలోని ప్యూర్ ఎనర్జీ ఈ సినిమాలో కనిపించింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలను.. ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే వుంటామని అన్నారు.


హీరోయిన్ నివేద థామస్ (Nivetha Thomas) మాట్లాడుతూ.. ఈ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ థాంక్ యూ. మేము చాలా థియేటర్స్‌ని విజిట్ చేశాం. అన్నిచోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది. నిన్న ఓ సింగిల్ స్క్రీన్‌కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్‌లో సినిమా ప్లే చేసిన అనుభూతిని ఇచ్చింది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ థ్యాంక్యూ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విశ్వదేవ్, డైరెక్టర్ నంద కిషోర్, నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి, నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ.. సినిమా సక్సెస్‌పై వారి ఆనందాన్ని తెలియజేశారు.

Read Latest Cinema News

Updated Date - Sep 08 , 2024 | 06:51 PM