Natural Star Nani: ఒకరోజు స్కూల్ మిస్ అయినా.. ఈ సినిమా మిస్ కావద్దు

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:56 PM

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. సెప్టెంబర్ 6న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నాని ఏం మాట్లాడారంటే..

35 Chinna Katha Kaadu Pre Release Event

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల సిద్ధమైన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మాట్లాడుతూ.. ‘35-చిన్న కథ కాదు’ సినిమా చూశాను. నేను ఈమధ్య కాలంలో చూసిన మోస్ట్ బ్యూటీఫుల్ తెలుగు సినిమా ఇదే. ప్రతి అమ్మ, ప్రతి నాన్న వాళ్ళ పిల్లలని తీసుకుని వెళ్ళాల్సిన సినిమా ఇది. అందరికీ పర్సనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఒకరోజు స్కూల్ మిస్ అయినా పర్వాలేదు. ఆ రోజు స్కూల్‌లో నేర్చుకున్నదానికంటే ఈ సినిమాలో ఎక్కువ నేర్చుకుంటారు. అరుదుగా వచ్చే మంచి సినిమాలివి. తెలుగు ఆడియన్స్ ఇలాంటి పాజిటివిటి, ఫ్రెష్‌నెస్‌ని చూసినప్పుడు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 6 తర్వాత సినిమా సక్సెస్ స్టోరీ చిన్న కథ కాదు. అందరూ గొప్పగా పెర్ఫామ్ చేశారు. బ్యూటీఫుల్ సినిమా తీశారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..

ట్యాలెంట్ ఏ ఇండస్ట్రీలో వున్నా రానా కంటపడితే ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఇండస్ట్రీలో నా బలమైన ఫ్రెండ్ రానా. ఈ సినిమాని రానా ప్రెజెంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. నివేద ‘జెంటిల్‌మెన్’ నుంచి పరిచయం. తను మా ఇంట్లో మనిషి అయిపొయింది. తను చాలా హానెస్ట్. బ్యూటీఫుల్‌గా యాక్ట్ చేసింది. తన క్యారెక్టర్ అమ్మని గుర్తుకు తెస్తుంది. విశ్వ చాలా మెచ్యురిటీతో పెర్ఫామ్ చేశాడు. తను మరెన్నో గొప్పగొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శి ఎంచుకున్న కంటెంట్ బావుంటుంది. తనని చూస్తే తెలుగు అమీర్ ఖాన్ అనిపిస్తుంది. ఇందులో ఇరగ్గొట్టాడు. నంద కిషోర్ గారిలో హానెస్ట్ వుంది. అది ఈ సినిమాలో కనిపించింది. అద్భుతమైన యాక్టింగ్ రాబట్టాడు. సృజన్ సినిమా పిచ్చోడు. ఇలాంటి సినిమాలు మరో వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మ నాన్న ఇది మనమే కదా అనుకుంటారు. పిల్లల్ని తీసుకొని థియేటర్స్‌కి వెళ్ళండి. సెప్టెంబర్ 6న ఒక సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు. అది చిన్న కథ కాదు అని అన్నారు.


మూవీ ప్రజెంటర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. ‘35-చిన్న కథ కాదు’ నాని గారి బయోపిక్ అన్నారు కానీ కథ విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా. నాకు మ్యాథ్స్ అస్సల్ వచ్చేవి కావు. 35 అనేది హ్యుజ్ టాస్క్‌లా వుండేది. ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా వుంది. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ నచ్చేవారు కాదు. ఇందులో దర్శి ఎగ్జాట్‌గా అలానే వున్నాడు. నివేద, విశ్వని చూస్తే మా మదర్, ఫాదర్ ఏదో మూమెంట్‌లో గుర్తుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలు చేస్తున్న ఈ సినిమా నిర్మాతలకు ఎప్పుడూ నా సపోర్ట్ వుంటుంది. నాని నేను కలిసే ఫేవరేట్ పర్సన్. నాని ఆల్వేస్ స్పెషల్. సెప్టెంబర్ 6న సినిమా విడుదలవుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇదని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 04 , 2024 | 08:56 PM