Vir Das: మొదటి భారతీయ కమెడియన్‌గా రికార్డు

ABN, Publish Date - Sep 12 , 2024 | 06:54 PM

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ (Emmy Awards) అవార్డుల వేడుక నవంబర్‌లో జరగనుంది. న్యూయార్క్‌ వేదికగా ఈ వేడుక అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ (Emmy Awards) అవార్డుల వేడుక నవంబర్‌లో జరగనుంది. న్యూయార్క్‌ వేదికగా ఈ వేడుక అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలో భారతీయ నటుడు సందడి చేయనుండడం విశేషం. బాలీవుడ్‌ హాస్యనటుడు వీర్‌ దాస్‌ (vir das) 2024లో జరగనున్న ఎమ్మీ అవార్డు వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈవిషయాన్ని తెలుపుతూ తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్న తొలి భారతీయ నటుడు వీర్‌దాస్‌ కావడంతో సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘(Emmy awards 2024)

స్టాండ్‌అప్‌ కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన వీర్‌దాస్‌.. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకొని కమెడియన్‌గా ఎదిగారు. గతేడాది జరిగిన ఎమ్మీ అవార్డ్స్‌, వరల్డ్‌ టెలివిజన్‌ ఫెస్టివల్‌ 2023 వేడుకలో వీర్‌దాస్‌ ఉత్తమ కమెడియన్‌గా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ‘వీర్‌ దాస్‌: ల్యాండింగ్‌’ అనే వెబ్‌ షోకు గానూ ఈ పురస్కారాన్ని అందుకున్నారాయన. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్‌ రికార్డు నెలకొల్పారు.

నాపై చూపుతోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అంతర్జాతీయ వేడుకలో భారతీయ నటుడు వ్యాఖ్యతగా కనిపించనున్నాడు. ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా’ అని వీర్‌ తెలిపారు. ఆయన పోస్ట్‌కు హృతిక్‌ రోషన్‌, బిపాసా బసు, అపూర్వ మెహతా తదితరులు కంగ్రాట్స్‌ చెబుతూ పోస్ట్‌లు పెట్టారు.

Updated Date - Sep 12 , 2024 | 06:54 PM