Jigra: అకౌంట్‌ డిలీట్‌.. నెగటివిటీ తట్టుకోలేకేనా..

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:22 PM

అలియాభట్‌ (Alia Bhatt), వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’ (Jigra). వాసన్‌ బాలా (vasan Bala) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఇటీవల విడుదలైంది.

అలియాభట్‌ (Alia Bhatt), వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’ (Jigra). వాసన్‌ బాలా (vasan Bala) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఇటీవల విడుదలైంది. అయితే అంచనాలు తారుమారై నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.  సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ఈ చిత్రాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాను వాసన్‌ డీయాక్టివేట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఖాతా కోసం సెర్చ్‌ చేస్తుంటే.. ఈ పేరుతో ఖాతా లేదని చెబుతోంది.  అయితే వాసన్‌ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉన్నారు. తమ సినిమాపై వస్తోన్న పాజిటివ్‌ రెస్పాన్స్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో ‘జిగ్రా’ చిత్రం తెరకెక్కింది. కరణ్‌ జోహార్‌ నిర్మించారు. అక్టోబర్‌ 11న విడుదలైంది.

‘సవి’ చిత్రాన్ని కాపీ కొట్టి ఈ సినిమా తెరకెక్కించారని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘జిగ్రా’ సినిమాకు సంబంధించి ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటిస్తున్నారంటూ ‘సవి’ నటి దివ్యా ఖోస్లా  కామెంట్‌ చేశారు. అలా చేస్తున్న ఆలియాభట్‌ ధైర్యానికి మెచ్చుకోవాలని పరోక్షంగా విమర్శించారు. దీనికి కరణ్‌ జోహార్‌ కూడా కౌంటర్‌ ఇచ్చారు. మూర్ఖుల కామెంట్‌లకు మౌనం వహించడమే సరైన సమాధానం అని సెటైర్‌ వేశారు. ఇదంతా బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఫేక్‌ బుకింగ్స్‌, కలెక్షన్స్‌ గురించి వాసన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘దీనికి డిస్ర్టిబ్యూటర్లు సమాధానం చెబుతారు. కలెక్షన్స్‌పై ఎవరైనా ఇన్వెస్టిగేట్‌ చేయొచ్చు. అందుకు స్వాగతిస్తాం’’ అని తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

Updated Date - Oct 20 , 2024 | 03:23 PM