Jigra: ఆ వ్యాఖ్యలు విని నవ్వుకున్నాం.. తర్వాత చిరాకొచ్చింది

ABN, Publish Date - Oct 15 , 2024 | 01:04 PM

అలియాభట్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.


అలియాభట్‌ (Alia bhatt) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’ (Jigra) దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ఖాళీగా ఉన్నాయని, కానీ ఫేక్‌ కలెక్షన్లు చూపిస్తున్నారని టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ బార్య దివ్యాఖోస్లా (Divya Khosla) కామెంట్‌ చేశారు. దీనికి చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ (karan Johar) పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు కూడా.  తాజాగా దర్శకుడు వాసన్‌ బాల (Vasan Bala) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్క్రిప్ట్ విషయంలో కరణ్‌ తనపై అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

‘‘నేను రఫ్‌గా రాసుకున్న స్క్రిప్ట్ ను కరణ్‌ జోహర్‌కు పంపాను. ఆయన దాన్ని చూడకుండా అలియాకు పంపించారు. కొంత సేపటికి నేను స్క్రిప్ట్ పంపానని చెప్పడానికి కరణ్‌కు కాల్‌ చేస్తే.. అప్పటికే దాన్ని అలియాకు పంపినట్లు చెప్పారు. తాను ఆ స్ర్కిప్ట్‌తో సంతోషంగా లేనని కరణ్‌ అసహనం వ్యక్తం చేశారు. దానికి ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉందని అప్పుడే అలియాకు ఎందుకు పంపారని నేను అడగ్గా.. రెండు రోజుల్లో కలిసి పూర్తిగా మాట్లాడుకుందామని చెప్పారు. ఆశ్చర్యంగా అలియా ఆ సగం స్ర్కిప్ట్‌ చదివే సినిమాను ఓకే చేశారు’’ అని వాసన్‌ బాల చెప్పారు.  మరోవైపు తన గురించి దర్శకుడు చేసిన కామెంట్స్‌పై కరణ్‌ స్పందించారు. స్క్రిప్ట్  చదవకుండా తాను అలియాకు పంపానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కామెంట్స్‌ విని మొదట నవ్వుకున్నప్పటికీ తర్వాత చిరాకు కలిగిందని తెలిపారు. దయచేసి దర్శకుడి ఇంటర్వ్యూ మొత్తం విని తనను కామెంట్‌ చేయాలని నెటిజన్లను కోరారు.

Adah sharma: రుజువు చేసుకోవడమా.. ఆ అవసరం నాకు లేదు




ఇటీవల ఈ చిత్రం కలెక్షన్ల విషయంపై దివ్యాఖోస్లా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారడంతో చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ దీనిపై పరోక్షంగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’’ అనే సందేశాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు.  

Updated Date - Oct 15 , 2024 | 04:54 PM