మరో మగాడే లేనట్లు.. మా నాన్నే కావాలా.. నటిపై స్టెప్ డాటర్ ఫైర్
ABN, Publish Date - Nov 13 , 2024 | 02:13 PM
స్టెప్ మదర్, స్టెప్ డాటర్ మధ్య షాకింగ్ పోరు నడుస్తోంది. బాలీవుడ్ టీవీ నటి రూపాలీ గంగూలీపై స్టెప్ డాటర్ ఇషా వర్మ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన సదరు నటి.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ రూపాలీ ఏం చేసిందంటే..
టెలివిజన్ నటి రూపాలీ గంగూలీ (TV Actress Rupali Ganguly).. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, అనుపమ అనే సీరియల్స్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ప్రేమంటే ఇంతే’ అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. టెలివిజన్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ నటిగా రూపాలీ రికార్డ్ క్రియేట్ చేసింది. 2013లో వ్యాపారవేత్త అయిన అశ్విన్ కె వర్మను వివాహం చేసుకుంది. అయితే అప్పటికే అశ్విన్‌కు పెళ్లి అయ్యి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరే ఇషా. రూపాలీని పెళ్లి చేసుకోవడానికే అశ్విన్.. మొదటి భార్య స్వప్నకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read- SSMB29: రాముడిగా రాజమౌళి సినిమాలో మహేష్.. ఈ ట్విస్టేంటి జక్కన్న..
అశ్విన్‌కు రూపాలీ జంటకు ఒక బాబు ఉన్నాడు. నిత్యం సోషల్ మీడియాలో ఆమె తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను రూపాలీ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రూపాలీ గురించి అశ్విన్ మొదటి భార్య కూతురు అయినా ఇషా ఒక వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read-RGV: వర్మకు నోటీసులు..
‘‘నా తండ్రిని ఆమె దూరం చేసింది. నా తల్లికి అన్యాయం చేసింది. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకొని నా కుటుంబాన్ని విడగొట్టింది. బలవంతంగా నా తండ్రి చేత విడాకుల పత్రాలపై సంతకం చేసేలా చేసింది. రూపాలీ కోసమే మా నాన్న మలేషియా వదిలి ఇండియాకు వెళ్ళిపోయాడు. మరో మగాడే లేనట్లు.. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకోవడం తప్పు’’ అంటూ మాట్లాడింది.
ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వీడియోపై రూపాలీ కూడా సీరియస్ అయ్యింది. ఇషాపై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటిసులు పంపించింది. దీంతో ఇషా ఆ వీడియోను డిలీట్ చేయడమే కాకుండా.. తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టింది. బాలీవుడ్లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.