Tripti Dimri: యానిమల్ అందుకే చేశా.. రణ్‌బీర్ కాదు విక్కీ

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:40 PM

'యానిమల్' (Animal) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన నటి త్రిప్తి డిమ్రి(Tripti Dimri). ఇటీవల ఆమె సినిమాలోని తన పాత్ర, రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

'యానిమల్' (Animal) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన నటి త్రిప్తి డిమ్రి(Tripti Dimri). ఇటీవల ఆమె సినిమాలోని తన పాత్ర, రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో సపోర్టింగ్ రోల్‌లో కనిపించిన ఆమె కంప్లీట్‌గా ఆడియెన్స్‌లో లైమ్‌లైట్ పొందారు. తను చేసిన 'జోయా'(Zoya) క్యారెక్టర్‌ని  ధైర్యవంతురాలు మరియు అమాయకురాలిగా అభివర్ణించారు.


గతేడాది పాన్ ఇండియా మూవీ‌గా రిలీజైన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)  యానిమల్   మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించిన   త్రిప్తి డిమ్రి   కూడా అదే రేంజ్‌లో స్టార్ హీరోయిన్స్ లీగ్‌లో చేరింది. తాజాగా జరిగిన ఒక నేషనల్ ఈవెంట్‌లో ఆమె తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. మొదటగా ఈ రోల్ గురించి సందీప్ నేరేట్  చేసినప్ప్పుడు భయం వేసిందన్నారు. కానీ.. ఒక నటిగా తనని ఎక్సైట్ చేసి ఛాలెంజింగ్‌గా అనిపించే క్యారెక్టర్లనే తాను ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఈ రోల్ చేశానని అన్నారు. అలాగే తనని తాను కంఫర్ట్ జోన్‌లో ఉంచుకోదలుచుకోలేదని అన్నారు. ఇక మీ 3AM ఫ్రెండ్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు  ఖచ్చితంగా రణ్‌బీర్ కాదని, విక్కీ కౌశల్(Vicky kaushal) పేరు చెప్పారు.

2017లో బాబీ డియోల్, సన్నీ డియోల్ నటించిన 'పోస్టర్ బాయ్స్'(Poster Boys)సినిమాతో తెరంగ్రేటం చేసిన  త్రిప్తి  ఖాలా(Qala), అనుష్క శర్మ నిర్మించిన 'బుల్బుల్'(Bulbbul) సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రీసెంట్‌గా  విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ మూవీతో ఆమె మరో సూపర్ హిట్ సాధించారు. అలాగే నెక్స్ట్ రాజ్ కుమార్ రావ్‌తో విద్యా కా వో వాలా వీడియో( Vicky Vidya Ka Woh Wala Video), భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa 3)లతో పాటు తమిళ చిత్రం పరియేరుమ్ పెరుమాల్(Pariyerum Perumal) హిందీ రీమేక్ ధడక్ 2(Dhadak 2)తో స్ట్రాంగ్ లైనప్‌తో కనిపిస్తుంది.

Updated Date - Sep 26 , 2024 | 12:41 PM