Ott Thrillers: సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ చిత్రాలు చూడాల్సిందే!
ABN, Publish Date - Apr 25 , 2024 | 11:05 AM
సినిమాల్లో సస్పెన్స్ జానర్‌కు ఉన్న క్రేజ్. కామెడీ చిత్రాలకు ఎంత ఆదరణ దక్కుతుందో అంతకు మించి ఆదరణ సస్పెన్స్ జానర్ చిత్రాలకు ఉంటుంది. ఆ తరహా చిత్రాలకు కలెక్షన్లు భలే ఉంటాయి. సీజన్ , లాంగ్వేజ్, స్టార్లతో సంబంధం లేకుండా థ్రిల్లర్ జానర్ అయితే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
సినిమాల్లో సస్పెన్స్ జానర్‌కు ఉన్న క్రేజ్. కామెడీ చిత్రాలకు ఎంత ఆదరణ దక్కుతుందో అంతకు మించి ఆదరణ సస్పెన్స్ జానర్ చిత్రాలకు ఉంటుంది. ఆ తరహా చిత్రాలకు కలెక్షన్లు భలే ఉంటాయి. సీజన్ , లాంగ్వేజ్, స్టార్లతో సంబంధం లేకుండా థ్రిల్లర్ జానర్ అయితే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ప్రస్తుతం ఇలాంటి చిత్రాలు కొన్ని ఓటీటీల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
సైలెన్స్ 2: (Silence 2)
ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన చిత్రమిది. నైట్ ఓల్ బార్ ఇన్ ముంబై అనే షూటౌట్ కేసును టేకప్ చేసిన ఎసీపీ అవినాష్ ఆ కేసును ఎలా ఛేదించారు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుందీ సినిమా. అబాన్ భరుచా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జీ5లో అందుబాటులో ఉంది. 2021లో విడుదలయిన ‘సైలెన్స్’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది.
మర్డర్ ముబారక్: (murder mubarak)
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లోకి లేటెస్ట్‌గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'మర్డర్ ముబారక్’. హోమి అదజానియా దర్శకత్వంలో సారా అలీఖాన్, విజయ్ వర్మ, కరీష్మ కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, పంకజ్ త్రిపాఠీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రామింగ్ అవుతోంది.
జానే జాన్: (jaane jaan)
హత్య విచారణలో చిక్కుకున్న ఒంటరి తల్లి, ఆమె కుమార్తె కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'జానే జాన్’. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కరీనా కపూర్, విజయ్‌వర్మ, జైవీప్ అహ్లావత్ కీలక పాత్రధారులు.
మెర్రీ క్రిస్మస్: (Merry Christmas)
విజయ్ సేతుపతి, కత్రినా కేౖఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'మెర్రీ క్రిస్మస్’. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓ సింపుల్ లైన్ ను ఫిలాసఫికల్‌గా తనదైన శైలి ట్విస్ట్‌లతో చెప్పి ఆడియన్సను మెప్పించారు. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
కడక్ సింగ్: (Kadak singh)
అమ్‌నేషియా అనే లాస్ ఆఫ్ మెమరీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి చిట్‌ఫండ్ కంపెనీ స్కామ్‌ను ఎలా ఛేదించాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు దర్శకుడు అనిరుద్ద రాయ్. ఆయన తెరకెక్కించిన చిత్రం కడక్ సింగ్. పంకజ్ త్రిపాఠీ, సంజన సంఘి కీలక పాత్రధారులు. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.
Read Latest Cinema News