Salman Khan: సల్మాన్‌కి మళ్ళీ బెదిరింపులు.. అసలు వదిలేలా లేరుగా
ABN, Publish Date - Oct 30 , 2024 | 02:31 PM
తాజాగా రూ. 2 కోట్లిస్తే సల్మాన్ కి ప్రాణభిక్ష పెడతామని మరో మెసేజ్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే కొందరిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎం జరుగుతుందంటే..
సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యానంతరం సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువై పోయాయి. రూ. 5 కోట్లు ఇస్తే సల్మాన్‌కి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులుకు మరో ఛాలెంజ్ ఎదురైంది. తాజాగా రూ. 2 కోట్లిస్తే సల్మాన్ కి ప్రాణభిక్ష పెడతామని మరో మెసేజ్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాగే కొందరిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎం జరుగుతుందంటే..
బాబా సిద్ధిఖీ హత్యానంతరం బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ఆకతాయిలు డబ్బును సంపాదించేందుకు సల్మాన్‌ని టార్గెట్ చేస్తూ.. పోలీసులకు ఫేక్ మెసేజులు పంపిస్తున్నారు. సున్నితమైన ఇష్యూ కావడంతో పోలీసులు కూడా సీరియస్‌గానే ఈ మెసేజ్ లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇటీవల రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తాం అని వచ్చిన మెసేజ్ ని విచారణ జరిపిన పోలీసులు.. జంషెడ్‌పూర్‌లో కూరగాయల వ్యాపారం చేసే 24 ఏళ్ల యువకుడు ఈ మెసేజ్ చేసినట్లు నిర్దారించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆ యువకుడు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాజాగా రూ. 2 కోట్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ మరో మెసేజ్ రావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ నొయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ తో పాటు బాబా సిద్ధిఖీ వారసుడు, ఎమ్మెల్యే జీషాన్ సిద్దిఖీని చంపుతానని యువకుడు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సల్మాన్ ‘దబాంగ్ రీలోడెడ్’ షో షూట్ కోసం దుబాయ్ వెళ్తున్నాడు. సల్మాన్ ఖాన్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, సునీల్ గ్రోవర్, అస్తా గిల్, మనీష్ పాల్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. డిసెంబర్ 7న ఈ షో ప్రారంభం కానుంది. దుబాయ్ హార్బర్‌లో ఈ షో జరగనుంది. ప్రస్తుతానికి ఈ షో టికెట్స్ సేల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బెదిరింపుల మధ్యే సల్మాన్ షూటింగ్ కి హాజరవుతుండటంతో ఫ్యాన్స్ కలవరపడుతూనే మద్దతు తెలుపుతున్నారు.