Salman Khan: సల్మాన్ ఖాన్.. మరో బుల్లెట్ ప్రూఫ్ కారు! ఫీచర్స్, ధర గురించి మీకు తెలుసా
ABN, Publish Date - Oct 18 , 2024 | 07:05 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నిత్యం రాకపోకలు సాగించే వాహానం విషయంలో మరింతగా జాగ్రత్త పడుతున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుస బెదిరింపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ముంబైలో హత్య గావించబడ్డ ఎన్సీపీ లీడర్‌ను తామే చంపినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సల్మార్ ఖాన్ వైపు మళ్లింది. చాలా కాలంగా బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) నుంచి వరుస బెందిరింపులు, రీసెంట్‌గా ఓ మెసేజ్ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సల్మాన్ చుట్టూ పరిస్దితి హై అలర్ట్‌గా ఉంది. ప్రభుత్వం సెక్యురిటీని మరింతగా పెంచింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ నిత్యం రాకపోకలు సాగించే వాహానం విషయంలో మరింతగా జాగ్రత్త పడుతున్నారు.
ఈక్రమంలో సల్మాన్ (Salman Khan) తన భద్రత నిమిత్తం.. గతేడాది నిస్సాన్ బ్రాండ్‌కు చెందిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రెండవ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మన ఇండియన్ మార్కెట్‌లో ఈ నిస్సాన్ పెట్రోల్ కారు అందుబాటులో లేని క్రమంలో సల్మాన్ ఖాన్ గతంలో దుబాయ్ నుంచి ఈ కారును దిగుమతి చేసుకోవలసి వచ్చింది. తాజాగా మరోమారు సల్మాన్ దుబాయ్ నుంచే రెండవ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఇంపోర్ట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటికే సల్మాన్ గ్యారేజీలో అన్నీ ప్రముఖ లగ్జరీ కార్స్ ఉన్నప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం, నిస్సాన్ పెట్రోల్ ఎస్యువిని ఎక్కువగా వాడుతుంటాడు. ఇది టాప్ టైర్ సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన హై ఎండ్ వాహనం. దీని ధర దాదాపు 2 కోట్లు ఉంటుంది. ఈ కారులో బ్లాస్టింగ్ వార్నింగ్‌తో పాటు, పాయింట్ బ్లాంక్ బుల్లెట్ షాట్‌లను తట్టుకునేలా మందపాటి గాజు షీల్డ్‌లు ఉంటాయా. అంతేకాదు డ్రైవర్, మరియు అందులో ప్రయాణిస్తున్న వారిని ఏమాత్రం గుర్తించలేని విధంగా బ్లాక్ షేడ్స్ వంటి అధునాతన భద్రతా ఫీచర్స్ ను కలిగి ఉంది. అదేవిధంగా 5.6-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా కారులో ఉంది.