Devdas: ఈ 'కల్ట్ క్లాసిక్' సినిమా వెనుకాల ఇన్ని కష్టాలా..
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:21 PM
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ నిర్మించిన 'దేవదాస్' అన్నిటికంటే ప్రత్యేకమైనది. దేశంలోని తొలిసారి 50 కోట్ల భారీ బడ్జెట్ తో షారుఖ్, ఐశ్వర్య, మాధురి దీక్షిత్ లాంటి స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమా నిర్మించారు. అయితే 1999లో ప్రారంభమైన ఈ సినిమా అనేక కష్ఠాలు ఎదురుకుంది. సినిమా ప్రొడ్యూసర్ అరెస్ట్ అయ్యాడు. ఇద్దరు ప్రధాన టెక్నీషియన్స్ చనిపోయారు. అయినా ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకొని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇంతకీ ఎం జరిగిందంటే..
ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ (Sarat Chandra Chattopadhyay) 1917లో రాసిన నవల 'దేవదాస్' (Devdas). ఈ నవల ఆధారంగా దేశంలోని పలు భాషల్లో అదే పేరుతో సినిమాలు నిర్మించి సూపర్ డూపర్ అందుకున్నారు. అయితే 2002లో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ (Sanjay Leela Bhansali) నిర్మించిన 'దేవదాస్' అన్నిటికంటే ప్రత్యేకమైనది. దేశంలోని తొలిసారి 50 కోట్ల భారీ బడ్జెట్ తో షారుఖ్, ఐశ్వర్య, మాధురి దీక్షిత్ లాంటి స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమా నిర్మించారు. అయితే 1999లో ప్రారంభమైన ఈ సినిమా అనేక కష్ఠాలు ఎదురుకుంది. సినిమా ప్రొడ్యూసర్ అరెస్ట్ అయ్యాడు. ఇద్దరు ప్రధాన టెక్నీషియన్స్ చనిపోయారు. అయినా ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకొని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇంతకీ ఎం జరిగిందంటే..
దేవదాస్.. భాష ఏదైనా ప్రేమ సాధించేది విజయం కాదు సంచలన విజయం అనే గట్టిగా చాటి చెప్పిన సినిమా. 2002లో బాలీవుడ్ లెజండరీ క్లాసిక్ సినిమాల దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన సినిమా మరింత ప్రత్యేకం. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'దేవదాస్', ఐశ్వర్య రాయ్ 'పారూ', మాధురి దీక్షిత్ 'చంద్రముఖి' పాత్రలు పోషించిన ఈ సినిమాని నిర్మాత భరత్ షా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాకి అండర్ వరల్డ్ మాఫియా ఫండ్ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రొడ్యూసర్ భరత్ షా అరెస్ట్ కూడా అయ్యారు. మరో వైపు ఈ సినిమాకి పనిచేస్తున్న ఇద్దరు ప్రధాన టెక్నీషియన్స్ ఆక్సిడెంట్ లో మరణించారు. దీంతో 1999లో ప్రారంభమైన ఈ సినిమా అనేక ఒడిదుడుకులు ఎదురుకొని 2002లో విడుదలైంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పటి వరకు కనివిని ఎరుగని 168 కోట్ల బాక్సాఫీస్ రికార్డ్ సొంతం చేసుకుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' (Cannes Film Festival) లో ప్రదర్శించబడింది. ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతో ఆదరిస్తున్నారంటే 'కల్ట్ క్లాసిక్ సినిమా' అనే పదానికి సరైన నిర్వచనం అంటే ఇదేనేమో. దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ కి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇక ఐశ్వర్య, మాధురి స్టెప్పులు వేసిన 'డోలా రే డోలా' ఇప్పటికి ప్రతి ఫంక్షన్స్ లో మోగాల్సిందే. దీంతో పాటు ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, విజయేంద్ర ఘట్గే, సుమన్ రంగనాథన్, కిరణ్ కుమార్, టికు తల్సానియా కీలక పాత్రల్లో అలరించారు.