Ruhani Sharma Agra: మొత్తానికి ఓటీటీకి.. విరాట్ కోహ్లీ మరదలు బోల్డ్ సినిమా! ఎక్కడ స్ట్రీమింగ్ అవుతందంటే?
ABN, Publish Date - Aug 21 , 2024 | 07:44 AM
ఈమధ్య వరుస సినిమాలతో జోరుమీదున్న కథానాయిక రుహానీ శర్మ ఐదారేండ్ల క్రితం నటించిన ఓ హిందీ చిత్రం ఎట్టకేలకు డిజిటిల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సోషల్ మీడియాను ఆగం పట్టిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ఎక్కడ స్ట్నీమింగ్ అవుతుందంటే..
చిలసౌ (Chi La Sow) అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియమైన మద్దుగుమ్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భార్య అనుష్క శర్మ (Anushka Sharma) సోదరి రుహానీ శర్మ (Ruhani Sharma). నటుడు, సింగర్ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ చిత్రంతోనే దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు. చిన్న చిత్రంగా వచ్చిన చిలసౌ జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇందులో రుహానీ (Ruhani Sharma) నటనకు మంచి మార్కులు పడ్డాయి అంతేకాదు గర్ల్ నెక్స్ట్ డోర్, హోమ్లీ నాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రుహానీ శర్మ (Ruhani Sharma) కథానాయికగా హిట్, హర్, నూటొక్క జిల్లాల అందగాడు, శ్రీరంగనీతులు సైంధవ్ వంటి సినిమాలతో పాటు డర్టీ హరి, మీట్ క్యూట్, సైంథవ్, ఆపరేషన్ వాలంటైన్ వంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసి మెప్పించింది.తరుచూ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు కలల రాణిగా మారింది.
అయితే అందాల ప్రదర్శణకు ఏమాత్రం మొహమాట పడని ఈ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) అప్పటికే ఒకటి రెండు హిందీ సీరీస్‌లలో ఇంటిమేట్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించి నోరెళ్లబెట్టేలా చేసింది. తర్వాత ఎక్కువగా టాలీవుడ్‌పైనే దృష్టి పెట్టిన ఈ చిన్నది తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో చుంబన దృశ్యాల్లో చేసింది తప్పితే గ్లామర్ పాత్రలు అసలు చేయలేదు. అయితే కెరీర్ ప్రారంభంలో 2019 సమయంలో నటించిన ఓ బాలీవుడ్ సినిమా ఆగ్రా (Agra) అన్ని అడ్డంకులను దాటుకుని గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
కానీ ఈ చిత్రంలో మితిమీరిన, హద్దు దాటిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉండడంతో ఇప్పటికీ థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోలేదు. అయితే గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌లో సినిమాను విడుదల చేసేందుకు ఉపక్రమించి ట్రైలర్ రిలీజ్ చేయగా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే అందులో రుహానీ శర్మ బోల్డ్ దృశ్యాలు చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు మూవీలో నటించింది రుహానీ శర్మేనా (Ruhani Sharma) అని ఇప్పటికీ నమ్మలేక పోతున్నారు. మరి ఇంత పచ్చిగా నటించిందేంటీ అంటూ నోరెళ్ల బెడుతున్నారు. చాలామంది నెటిజన్లైతై రుహనీకి ఎందుకీ ఖర్మ.. అలాంటి సినిమాలు చేయాల్సిన అవసరమేమొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. అలాంటి ఈ మూవీని ఇండియాలో థియేటర్లలోకి తీసుకురాకముందే ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ముఖ్యంగా రుహానీ శర్మ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి, రుహనీ గురించి రచ్చ రచ్చ అవుతోంది. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గత ఏడాది పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో తెలుగులో వచ్చిన చిత్రం మంగళవారం. ఈ సినిమాలో కథానాయిక ఓ రకమైన అరుదైన సిండ్రోమ్‌తో బాధ పడుతూ.. తనకు వచ్చే తీవ్రమైన కోరికలను తీర్చుకునే సమయంలో కంట్రోల్ తప్పి అందుబాటులో ఉన్న వారితో పని కానిచ్చేస్తుంది. సరిగ్గా అలాంటి కథనంతో వచ్చిన మూవీనే ఈ ఆగ్రా (Agra). ఇందులో కాల్ సెంటర్‌లో పని చేసే హీరోకు కోరికల పిచ్చి ఉంటుంది. ఈ నేపథ్యంలో లేని ఓ యువతి (మాలతి)ని ఉహించుకుని తన కోరిక తీర్చుకుంటుంటాడు. ఆ పని శృతి మించడంతో కుటుంబ సభ్యులు మెంటల్ ఆస్పత్రిలో చూయించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో పని చేసే ఓ యువతితో హీరోకు పరిచయం ఏర్పడి బాగా దగ్గరవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బంధం చివరి వరకు కొనసాగిందా, ఇంట్లో వారితో హీరో ఎలా ప్రవర్తించే వాడు, చివరకు ఏమైంది, ఆ మాలతి మళ్లీ హీరో జీవితంలోకి వచ్చిందా అనే కథనంతో సినిమా ముగుస్తుంది.
రుహానీ అంతగా హద్దులు దాటి మరీ చేసిన ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత స్ట్రాంగగో, నిడివి ఎక్కువ అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. సినిమాలో రుహానీ శర్మ కేవలం హీరో కలలో వచ్చే యువతి పాత్రలో మొత్తంగా నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువగా కనిపించదు. ప్రస్తతం ఈ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది కానీ.. మన దేశంలో కాదు. ఫ్రాన్స్ దేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి వచ్చింది. మన దగ్గర టెలిగ్రామ్, కొన్ని విదేశీ ఫ్రీ వెబ్ సైట్లలో సినిమా బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం మన కంట్రీలో విడుదలయ్యే సూచన అసలు కనిపించడం లేదు. ఈ మూవీని కనుబెల్ తెరకెక్కించగా మోహిత్ అగర్వాల్ (Mohit Agarwal) హీరోగా నటించాడు. చాలా కాలం తర్వాత రాహుల్ రాయ్ (Rahul Roy) ఈ సినిమాలో కనిపించగా రుహానీ శర్మ (Ruhani Sharma), అంచల్ గో స్వామి (Aanchal Goswami), ప్రియాంకా బోస్ (Priyanka Bose) కీలక పాత్రల్లో నటించారు.