Tapsee: నా భర్త ఎవరో తెలుసా?
ABN, Publish Date - Jul 29 , 2024 | 09:50 PM
తాప్సీ (Taapsee)తన తదుపరి చిత్రం ‘ఫిర్ అయీ హసీనా దిల్‌రుబా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు, వ్యక్తిగత విశేషాలు తెలిపారు.
తాప్సీ (Taapsee)తన తదుపరి చిత్రం ‘ఫిర్ అయీ హసీనా దిల్‌రుబా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు, వ్యక్తిగత విశేషాలు తెలిపారు. తన భర్త మథియాస్ బో గురించి మాట్లాడారు. ‘‘మథియాస్ నాకెంతో కాలంగా తెలుసు. ఇష్టాయిష్టాలు కలవడంతో స్నేహితులయ్యం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అయితే, మథియాస్ (mathias boe) ఎవరనేది చాలామందికి తెలియకపోవడం బాధాకరం. అతడు ఏం చేస్తున్నాడు. ఏం సాధించాడనేది చెప్పాలనుకోవడం లేదు. వ్యాపారవేత్త, లేదా క్రికెటర్ కానందున అతని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నాభర్త్త’’ అని చెప్పారు తాప్సీ.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో.. నటి తాప్సీ ఎంతో కాలం నుంచి రిలేషన్‌లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 23న వీరి పెళ్లి జరిగింది. ఉదయ్‌పుర్ వేదికగా అతి తక్కువమంది బంధవుల సమక్షంలో వివాహం జరిగింది. అయితే ఆమె తన పెళ్లి ఫొటోలు ఇప్పటివరకూ ఎక్కడా షేర్ చేయలేదు. మథియాస్ గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్- చిరాగ్ జోడీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.