Taapsee Pannu: వీసా నిబంధనలపై తాప్సీ ఏమందంటే..
ABN, Publish Date - Jan 25 , 2024 | 03:32 PM
షారుక్ ఖాన్ - తాప్సీ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డంకీ’. భారత్ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వీసా నిబంధనల పై స్పందించారు
షారుక్ ఖాన్ - తాప్సీ (Taapsee) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డంకీ’ (Dunki). భారత్ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వీసా నిబంధనల పై స్పందించారు. ‘‘వీసా కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు కఠినంగా ఉన్నాయి. సమాజంలోని పేదవాళ్లకు అవి వర్తించడం దురదృష్టకరం. కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి ధనవంతులు ఈజీగా వీసా పొందుతారు. తక్కువ ఆదాయం ఉన్నవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ కారణంతోనే మా చిత్ర బృందంలోని చాలామంది ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉన్నందున ‘డంకీ’ యూనిట్‌లోని కొంతమంది యూకే వీసా పొందలేకపోయారు’’ అని ఆమె అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ - షారుక్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి కలిగించిందన్నారు తాప్సీ.
ప్రస్తుతం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ కోసం తాప్సీ పని చేస్తున్నారు. ‘హసీన్ దిల్‌రుబా’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకుడు. విక్రాంత్ మాేస్స ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘హసీన్ దిల్‌రుబా’లో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఒక నటిగా నన్ను సవాల్ చేసిన పాత్ర అది. అలాంటి పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ సినిమాకు ఫస్ట్ అనుకున్నది నన్ను కాదు. వివిధ కారణాల వల్ల చాలామంది చాలామంది హీరోయిన్స్ దానిని రిజెక్ట్ చేశారు. చివరకు అందులో నటించే అవకాశం నాకు దక్కింది’’ అని చెప్పారు తాప్సీ.