Taapsee Pannu: అలా ఎందుకు అనుకుంటారో తెలీదు..

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:18 PM

నటిగానే కాదు నిర్మాతగానూ బిజీగా ఉన్నారు తాప్సీ. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చిత్ర పరిశ్రమలో తనకు వచ్చే అవకాశాల గురించి మాట్లాడారు


నటిగానే కాదు నిర్మాతగానూ బిజీగా ఉన్నారు తాప్సీ(Taapsee). ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చిత్ర పరిశ్రమలో తనకు వచ్చే అవకాశాల గురించి మాట్లాడారు. ‘ ఇండస్ట్రీలో లో ఉన్న అగ్ర దర్శకనిర్మాతలు నేను పెద్ద హీరోల సినిమాల్లో నటించనని అనుకుంటారు. సవాళ్లతో కూడిన పాత్రలే అంగీకరిస్తారని, మిగతా వాటికి ఓకే చెప్పనని అనుకుంటారు. అది నిజం కాదు.  అగ్ర హీరోల సినిమాల కథలు నా దగ్గరకు రావని నా మేనేజర్లు కూడా ఎప్పుడూ అడుగుతుంటారు. స్టార్‌ హీరో (Star Heros movies) సినిమాల్లో నటించాలనే ఒత్తిడి నాకేం లేదు. ‘డంకీ’ చేసినందుకు చాలా రిలాక్స్‌గా ఉన్నాను. అలాంటి సినిమాలే ఎక్కువ చేయాలనుకుంటున్నా. మంచి పాత్రలుంటే ఏ హీరో సినిమాలోనైనా నటించడానికి సిద్థంగా ఉన్నా. ‘హసీన్‌ దిల్‌రుబా’లో నా పాత్ర ఎంతో ఆనందాన్నిచ్చింది. నిజ జీవితంలో నేను అలాగే ధైౖర్యంగా, తెలివిగా ఉంటాను’ అన్నారు.

ప్రస్తుతం తాప్సీ ‘గాంధారి’ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  కిడ్నాప్‌ అయిన తన కూతురుని కాపాడుకునేందుకు ఓ తల్లి చేేస పోరాటం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దీనిని దేవాశిశ్‌ మఖిజా తెరకెక్కిస్తున్నారు. 

Updated Date - Nov 25 , 2024 | 02:18 PM