Taapsee: హీరోయిన్స్‌ని ఎలా చూస్తున్నారంటే.. తాప్సీ వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 03 , 2024 | 07:21 PM
షారుక్‌ఖాన్ (Shahrukh khan) హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ (Raj kumar Hirani) తెరకెక్కించిన ‘డంకీ’ (Dunki) చిత్రంలో నటించినందుకు కాను తానేమీ అధిక చపారితోషికం తీసుకోలేదని తాప్సీ అన్నారు.
షారుక్‌ఖాన్ (Shahrukh khan) హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ (Raj kumar Hirani) తెరకెక్కించిన ‘డంకీ’ (Dunki) చిత్రంలో నటించినందుకు కాను తానేమీ అధిక చపారితోషికం తీసుకోలేదని తాప్సీ అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘సినీ పరిశ్రమలో ఎంతో కాలం ఉన్నా. భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటా. రెమ్యునరేషన్ విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు. ‘జుడ్వా 2’, ‘డంకీ’ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నానని పలు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చూస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది.. మేము మంచి సినిమా ఇచ్చి మీ కెరీర్‌కు సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది అన్నట్లు మాట్లాడతారు.
ఇలాంటి మాటలపై ప్రతిరోజూ పోరాటం చేస్తున్నా. కొన్ని సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించాలనే విషయాన్ని హీరోనే నిర్ణయిస్తారు. కొంతమంది హీరోలు ట్రెండింగ్‌లో ఉన్నవారిని ఎంచుకుంటారు.. ఇంకొందరు తమని డామినేట్ చేయని వాళ్లను తీసుకుంటారు’’ అని అన్నారు. ప్రస్తుతం తాప్సీ చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే రెమ్యునరేషన్ గురించి తాప్సీ మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె చాలా సందర్భాల్లో రెమ్యునరేషన్‌లో వ్యత్యాసంపై మాట్లాడారు. ‘‘హీరోయిన్స్ అధిక మొత్తంలో డిమాండ్ చేేస్త సమస్యగా మారుతుంది. హీరో రెమ్యునరేషన్ పెంచితే అది అతని సక్సెస్‌గా అభివర్ణిస్తారు. రోజు రోజుకీ ఈ వ్యత్యాసం పెరుగుతుంది’’ అంటూ గతంలో అసహనం వ్యక్తం చేశారు.