Alka Yagnik: స్టార్ సింగర్‌కు అరుదైన వ్యాధి.. ఆమె చెప్పిన విషయం వింటే హెడ్ ఫోన్స్ వాడరు

ABN, Publish Date - Jun 18 , 2024 | 07:47 PM

అల్కా యాగ్నిక్.. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎన్నో పాటలు పాడిన ప్రముఖ సింగర్. ఒక్క బాలీవుడ్ అనే కాదు.. తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠి వంటి ఎన్నో భాషల్లో పాటలు పాడి.. స్టార్ సింగర్ స్టేటస్‌ని అనుభవించిన అల్కా యాగ్నిక్ ఇప్పుడో వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం స్వయంగా ఆమెనే.. తన ఇన్‌స్టా వేదికగా తెలపడం గమనార్హం.

Star Singer Alka Yagnik

అల్కా యాగ్నిక్.. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎన్నో పాటలు పాడిన ప్రముఖ సింగర్. ఒక్క బాలీవుడ్ అనే కాదు.. తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠి వంటి ఎన్నో భాషల్లో పాటలు పాడి.. స్టార్ సింగర్ స్టేటస్‌ని అనుభవించిన అల్కా యాగ్నిక్ ఇప్పుడో వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం స్వయంగా ఆమెనే.. తన ఇన్‌స్టా వేదికగా తెలపడం గమనార్హం. ప్రస్తుతం ఆమె సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా చెబుతూ.. ఈ వ్యాధికి కారణం కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అల్కా యాగ్నిక్ (Star Singer Alka Yagnik) తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..

అందరికీ ఓ విషయం చెప్పాలి. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగుతున్నప్పుడు సడెన్‌గా నాకేం వినబడలేదు. కొన్ని రోజులుగా నాకు అసలు ఏం వినిపించడం లేదు. చాలా మంది మీ ఈ మధ్య కనిపించడం లేదేంటి? అంటూ అడుగుతున్నారు. వారందరికీ నేను చెప్పే విషయం ఏమిటంటే.. నేనొక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. దీని పేరు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌. వైరల్ అటాక్ వల్ల ఈ వ్యాధి వస్తుంది ఇటీవలే డాక్టర్స్ చెప్పారు. షాకయ్యాను. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అందరికీ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.. హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. బిగ్గరగా సౌండ్ చేసే వాటికి దూరంగా ఉండండి.. అని అల్కా యాగ్నిక్ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం ఆమె పోస్ట్ చూసిన వారంతా మంచి మెసేజ్ ఇచ్చారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, త్వరగా ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 07:47 PM