Sonusood: ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలనుంది అమ్మా!
ABN, Publish Date - Jul 21 , 2024 | 03:52 PM
తన తల్లి సరోజ్ సూద్ (Saroj sood) జయంతి సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు నటుడు సోనూసూద్(Sonusood). ఆమెను తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తన తల్లి సరోజ్ సూద్ (Saroj sood) జయంతి సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు నటుడు సోనూసూద్(Sonusood). ఆమెను తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్ అమ్మా’’ అని రాసుకొచ్చారు.
రీల్ హీరోగా ఉన్న ఆయన రియల్ హీరో అని నిరూపించుకున్నారు. కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆ తర్వాత సాయం కావాలని కోరిన వారికి చేయూతనందించారు. ఈ క్రమంలోనే సూద్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్ని అందించేందుకు 2022లో శ్రీకారం చుట్టారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.